Committee Kurrollu-Gorrela Telugu Song Lyrics

Committee Kurrollu-Gorrela Telugu Song Lyrics

Movie : Committee Kurrollu
Language : Telugu
Lyricist : Nag Arjun Reddy
Singer’s : Anudeep Dev ,Vinayak , Akhil Chandra , Harshavardhan Chavali, Aditya Bheemathati , Sindhuja Srinivasan , Maneesha Pandranki, Arjun Vijay
Music Director(s) : Anudeep Dev
Label : T-Series Telugu
Year : 2024
Starring : Sharanya Suresh, Prasad Behara, Tejaswi Rao, Sandeep Saroj

నాన్నా బండి తీయ్..
బాబోయ్ తాగున్నాను
బండి తీయకూడదు
మందు తాగి బండే కాదు నాన
ఓటు కూడా వేయకూడదు
మందుందా.. ఏయ్ ఎలక్షన్లో ఎవడ్రా
నీకు మందు పంచి పెట్టేది
అదేంటి అక్కడ A1 గాడు
పంచుతున్నాడు కదా

మందిస్తే చాలంటారే
మంచక్కర్లేదంటారే
ఎవడోస్తే మాకెంటంటూ
ఎర్రోళ్లై బతికేస్తారే
మందిస్తే చాలంటారే
మంచక్కర్లేదంటారే
ఎవడోస్తే మాకెంటంటూ
ఎర్రోళ్లై బతికేస్తారే
రోడ్లన్ని గతుకుల పాలే
ఊరంత చీకటి పాలే
రేషన్లు పింఛన్లన్ని
మొత్తానికి గల్లంతాయే
రోడ్లన్ని గతుకుల పాలే
ఊరంత చీకటి పాలే
రేషన్లు పింఛన్లన్ని
మొత్తానికి గల్లంతాయే

ఎన్నున్నాయ్ ఓట్లు.. నాలుగండి
అరేయ్ నాలుగంట రా
ఏమోవ్ ఈయన దగ్గర
చీరలు కుంకంబరినలు తీస్కోని
ఓటేయడం కంటే
గుడి మెట్ల మీద
అడుక్కోవడం చానా మేలు
స్వాగో స్వాగు
స్వాగు స్వాగు స్వాగు స్వాగు స్వాగు

హే పట్టు చీరల్నే పంచి
వెండాభరణాలే ఇచ్చి
ఏమరుస్తారే ఆళ్లకు
కావాల్సిందల్లా కుర్చీ
పట్టు చీరల్నే పంచి
వెండాభరణాలే ఇచ్చి
ఏమరుస్తారే ఆళ్లకు
కావాల్సిందల్లా కుర్చీ

ఆ కాయ కష్టం చేయనీయకుండా
డబ్బిస్తుంటే ఏం చేస్తాం
నచ్చే చీర చూపిస్తుంటే
కట్టేయకుండా ఏం చేస్తాం

ఏరా ఎలక్షన్కి బయలుదేరావా
లేదు నాన్న చదువుకోవాలి
అబ్బో కలెక్టర్ అయ్యావ్లే కానీ బయలుదేరు
ఓటుకి ఐదేలంట
ఐదేలా.. ఐదేలే
ఐతే వచ్చేతున్నా నాన్నోయ్

చదువే సల్లారిపాయే
బతుకే తెల్లారిపాయే
డబ్బే చేసిందే మాయే
ఊరంత గొర్రెలాయే
చదువే సల్లారిపాయే
బతుకే తెల్లారిపాయే
డబ్బే చేసిందే మాయే
ఊరంత గొర్రెలాయే

అసలేం కావాలండి మన ఊరోళ్లకి
నేను చెప్తాను ఉండు
మంచి జరగాలి ఊరు మారాలి
స్కూళ్ళు కావాలి జాబులు రావాలి
జాతకాలు మారిపోవాలి
అయిబాబోయ్ అద్భుతాలు జరిగిపోవాలి
ఏదేమైనా కానీ ఓటు మాత్రం
అమ్ముకు దొబ్బాలి రా
అంటే చివరికారికి
ఏమంటారండి ఇప్పుడు

డబ్బిచేటోల్లని మింగా
ఓట్లమ్మేటోల్లని మింగా
ఐదేళ్లకు అమ్ముడుపోయే
గొర్రెమందల్ని మింగా
డబ్బిచేటోల్లని మింగా
ఓట్లమ్మేటోల్లని మింగా
ఐదేళ్లకు అమ్ముడుపోయే
గొర్రెమందల్ని మింగా

డబ్బిచేటోల్లని మింగా
ఓట్లమ్మేటోల్లని మింగా
ఐదేళ్లకు అమ్ముడుపోయే
గొర్రెమందల్ని మింగా

నాన్నా మింగటమంటే ఏమిటి నాన్నా
ఇప్పుడు డబ్బులు తీస్కోని
ఓట్లు అమ్ముకునే వాళ్ళందరిని
నమిలి మింగేయాలనమాట
నమిలి…. అన్నా అన్నా అన్నా
బూతులు బూతులు మింగేయ్ మింగేయ్ కంట్రోల్
ఓకే నాన్నా…

స్వాగో స్వాగు
స్వాగు స్వాగు స్వాగు స్వాగు స్వాగు

Committee Kurrollu-Gorrela Telugu Song Lyrics