Janaka Ayithe Ganaka-Naa Favourite Naa Pellam Telugu Song Lyrics

Janaka Ayithe Ganaka-Naa Favourite Naa Pellam Telugu Song Lyrics

Movie : Janaka Ayithe Ganaka
Language : Telugu
Lyricist : Krishna Kanth
Singer’s : Adithya RK
Music Director(s) : Sandeep Reddy Bandla
Label : T-Series Telugu
Year : 2024
Starring : Suhas, Sangeerthana

నేనేదిఅన్న బాగుంది కన్నా
అంటూనే ముద్దడుతువే
నీవే…నా పక్కనుంటే చాలే…

కష్టాలు ఉన్న కాసేపు అయినా
రాజాలా పోజు కొడతానే
నీవే…నా పక్కనుంటే చాలే…

కలతలు కనబడవే
నువ్వు ఎదురుగా నిలబడితే
గొడవలు జరగావులే
ఒడుదుడుకులు కలగావులే
అరక్షణమైన అసలెప్పుడైనా
కోపం నీలోనా
ఎప్పుడైనా చూశానా…..


పుణ్యమేదో చేసి ఉంటనే
నేడు నేను నిన్ను పొందెనే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే
ఓ…ఆ …

హే ఉదయం నే లేచే ఉన్న
వేచుంటనే
నువ్వే ముద్దిచ్చేదాకా
మంచం దిగానే

హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీ
కొంచం బోరంటూ ఉన్న కదా మాఫీ

మన గదులిది ఇరుకులు కానీ
మన మనసులు కావే
ఎగరడమే తెలియదు గానీ
ఏ గొలుసులు లేవే

నువ్వు అన్న ప్రతి ఒక్క మాట
సరి గమ పద నిస పాట
గుండా కూడా చిందులేసేనంట
చూడే ఈ పూట
ఆ…ఓ…

పుణ్యమేదో చేసి ఉంటనే
నేడు నేను నిన్ను పొందెనే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

Janaka Ayithe Ganaka-Naa Favourite Naa Pellam Telugu Song Lyrics